AIFDS ఆధ్వర్యంలో తాండ్ర కుమార్ స్మారక క్రీడోత్సవాలు

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 9 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): శ్రీ చైతన్య క్రీడా మైదానంలో ఫిబ్రవరి 6,7, 8 తేదీలలో అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య(AIFDS) ఆధ్వర్యంలో తాండ్ర కుమార్ స్మారక క్రీడా ఉత్సవాలలో భాగంగా ఆటల పోటీల‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అండ‌ర్ 17 క‌బ‌డ్డీ, క్రికెట్ పోటీల్లో యువ‌త ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రికెట్‌లో కామ్రేడ్స్ ఎలెవెన్ జ‌ట్టు మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, క‌బ‌డ్డీలో మియాపూర్ న్యూ కాల‌నీ విజ‌యం సాధించింది. ఈ సంద‌ర్భంగా విజేతలకు హైకోర్టు అడ్వకేట్ ఎ జి పి తాండ్ర రమేష్, యం సి పి.ఐ(యు) మియాపూర్ కార్యదర్శి ఇస్లావత్ దశరధ్ నాయక్ ట్రోఫీలు, నగదు బహుమతుల‌ను అందచేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టీ పీ సి సి లీగల్ సెల్ కన్వీనర్ కనకమామిడి సురేందర్ గౌడ్, ప్ర‌ముఖ న్యాయవాదులు శివ కృష్ణ, తాండ్ర వేణు , రాజశేఖర్, సి పి ఎం నాయకుడు కృష్ణ పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి హాజ‌రై మాట్లాడుతూ క్రీడ‌ల వల్ల కొత్త వ్యక్తులను కలిసి స్నేహ బంధం బ‌ల‌ప‌డి సామాజిక నైపుణ్యం పెరుగుతుంద‌న్నారు. క్రీడ‌ల వల్ల మానసిక ఒత్తడి త‌గ్గుతుంద‌ని అన్నారు.

ఈ కార్యక్రమంలో యం సి పి ఐ (యు )గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యుడు యార్లగడ్డ రాంబాబు, మహిళా సంఘ నాయకులు జి శివాని, ఎండీ సుల్తానా బేగం, రజియా బేగం, శ్రీలత, పార్టీ సభ్యుడు ఎం రాములు, విద్యార్థి సంఘం నాయకులు అరుణ్, రాజు, రాంబాబు, సురేష్, నవీన్, క్రీడాకారులు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here