శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): మున్సిపల్ ఎన్నికల సందర్బంగా శంకర్ పల్లి మున్సిపాలిటీ లోని 6 వ వార్డులో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కార్తీక్ రెడ్డితో కలిసి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా చిన్న శంకర్ పల్లి లో ఇంటింటికి తిరిగి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ని గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి ని, ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమం లో రాగం జంగయ్య యాదవ్, దార్గుపల్లి నరేష్, శామ్లెట్ శ్రీనివాస్ , దారుగుపల్లి పరమేష్, స్థానిక బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






