యాదవులు నిర్వ‌హించే స‌ద‌ర్ ఉత్స‌వం ఐక‌మ‌త్యానికి చిహ్నం: భేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నార్సింగ్ వైస్ చైర్మన్ జి వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ మహోత్సవ కార్యక్రమంలో రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఘనంగా సదర్ నిర్వహిస్తున్న వెంకటేశ్ యాదవ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. యాదవుల గొప్ప పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్న ఈ పండుగ కుల మతాలకు అతీతంగా ఐక్యమత్యానికి చిహ్నంగా నిలుస్తుంద‌న్నారు. అందరూ ఐక్యమత్యంతో ఉండి యాదవుల వృత్తిని కాపాడుతూ ఐక‌మత్యమే మహాబలంగా ప్రతి ఒక్కరూ సామాజిక న్యాయంతో మెల‌గాల‌ని అన్నారు. అందరూ విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయాల్లో ముందు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెరుగు ఐలేష్ యాదవ్, అందెల కుమార్ యాదవ్, తెల్లాపూర్ శేఖర్, శంషాబాద్ మిద్దెల తేజస్వి తేజ యాదవ్, అరుణ్, కృష్ణ యాదవ్, రాము యాదవ్, యాదవ్ సంఘం నాయ‌కులు, యువజన నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here