శేరిలింగంపల్లి, ఏప్రిల్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం మనసురాబాద్ డివిజన్ పరిధిలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్, పరాల శేఖర్, సుభాష్ చందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్, చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి, మనసురాబాద్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, ఇతర రాష్ట్ర , జిల్లా నాయకులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి నూతన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో బలమైన నాయకత్వం ద్వారా పార్టీని పునాది స్థాయిలో బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. కష్టపడిన వారిని తగిన పదవులు వరిస్తున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ఎల్.బి నగర్ ,శేరిలింగంపల్లి నియోజవర్గాలలో విజయం సాధించే దిశగా కృషి చేయాలన్నారు.సమస్య ఏదైనా కావచ్చు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలతో మమేకమై ఉండాలన్నారు,మీకు అండగా మేమున్నామని పోరాడి గెలుద్దామన్నారు. అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని, కొత్త కార్యాలయం ప్రజలతో పార్టీకి సంబంధాలను మరింత బలపరచేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు బుచ్చిరెడ్డి, వసంత కుమార్ యాదవ్, మాదాపూర్ డివిజన్ బీజేపీ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా మాజీ అధ్యక్షుడు హనుమంతు నాయక్, మహిళా మోర్చా నాయకులు గీతా రెడ్డి, నరేందర్ రెడ్డి, మనుభూషణ్, సీనియర్ నాయకులు సంజీవ్, నందు, అశోక్ , నరేంద్ర ముదిరాజ్, బబ్లు సింగ్ , నరసింహారాజు , కమలాకర్ రెడ్డి, నరసింహ చారి, విష్ణు, ఆంజనేయులు, మహిళా మోర్చా నాయకులు, బీజేవైఎం నాయకులు, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి పరిధిలోని రాష్ట్ర నాయకులు,డివిజన్ నాయకులు, స్థానిక నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





