కోట్ల రూపాయ‌ల వ్యయంతో అభివృద్ధి ప‌నులు: పిఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ఓయూ ప్రొఫెసర్ కాలనీలో రూ.60 లక్షల అంచనా వ్యయంతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు గాను స్థానిక నాయకులతో కలసి పిఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అవసరం అయిన‌ మౌలిక వసతుల ఏర్పాటుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని తెలియజేశారు. కోట్ల రూపాయల‌ వ్యయంతో అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. ప్రజలు కోరుకొనే విధంగా కాలనీలను అభివృద్ధి చేసే బాధ్యత త‌మ‌పై ఉందని, నూటికి నూరు శాతం వారు కోరుకొనే విధంగా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్, సీనియర్ నాయకులు కొసరాజు లక్ష్మణ్, షేక్ చాంద్ పాషా, సుద్దపల్లి విజయ్ కృష్ణ, విజయ్ శర్మ, కరీం లాలా, పెరుక రమేష్ పటేల్, మధు ముదిరాజ్, దీపక్ కచ్చావా, బోయినపల్లి గోపి కృష్ణ రావు, కొండల విద్యా సాగర్ రెడ్డి, అరుణ్, శ్రీకాంత్, అజిత్ రెడ్డి, సీహెచ్ సంతోష్, కే సంతోష్, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, రజనికాంత్, బుడుగు తిరుపతి రెడ్డి, రవి శంకర్ నాయక్, ఎర్ర రాజు, బసవ రాజు, కాట్రగడ్డ బసవ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here