శేరిలింగంపల్లి, ఏప్రిల్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన శ్రీ మదలర్మేల్ మంగా పద్మావతీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల 34వ వార్షిక బ్రహ్మోత్సవం కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని, వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామి వారి కృప ప్రజలందరి పై ఉంటుందని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ కాలనీ ప్రెసిడెంట్ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, దేవినేని ప్రసాద్, నాని, నాయకులు సంజీవ రెడ్డి, నాయినేనీ చంద్రకాంత్ రావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,ప్రసాద్, కృష్ణంరాజు, మల్లయ్య , అల్లం మహేష్, హరికృష్ణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.