కూకట్‌పల్లి (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్‌పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన ఆయుబ్ అహ్మద్ అలీ ఖాన్ ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.1 లక్ష విలువైన ఎల్‌వోసీ పత్రాలను శుక్రవారం బాధిత కుటుంబానికి కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాసరావులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తుందని, ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కోనేరు ప్రసాద్, పోతుల రాజేందర్, తిరుపతి, రజినీకాంత్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
