గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల లక్ష్మీ విహార్ ఫేజ్-1 లో నెలకొన్న సమస్యలను కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించిన కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీవాసులు తన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని అన్నారు. కాలనీల్లో అవసరమైన చోట సిసి రోడ్లను, వీధిలైట్లను ఏర్పాటు చేస్తామని, డ్రైనేజ్ సమస్యను కూడా పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ డివిజన్ అన్ని విధాలా అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి సూపర్ వైజర్ నాయక్, నల్లగండ్ల లక్ష్మీ విహార్ ఫేజ్-1 కాలనీ సభ్యులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
