హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న మంజీరా పైప్ లైన్ పనులను కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైప్ లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. డివిజన్ పరిధిలో ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రాజేశ్వర్ గౌడ్, శర్మ, కృష్ణా, ప్రసాద్ పాల్గొన్నారు.
