కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను త్వరితిగతిన పరిష్కరిస్తూ ముందుకు వెళుతున్నామని కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పేర్కొన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ లో రూ. 36 లక్షల అంచనా వ్యయంతో కొనసాగుతున్న ఓపెన్ నాలా మరమ్మత్తు పనులను, వరద నీటి ప్రవాహ డ్రైనేజీ (స్ట్రామ్ వాటర్ డ్రైన్) మరమ్మత్తు పనులను కార్పొరేటర్ హమీద్ పటేల్ గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు గఫుర్, జాఫర్, సలీం, శంకర్ పాల్గొన్నారు.
