నమస్తే శేరిలింగంపల్లి: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధించినట్లు అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని కృష్ణ కాలనీలో తెలంగాణ మహిళ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని శేరిలింగంపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రారంభించారు. శిక్షణకు వచ్చిన వారు పట్టుదలతో నేర్చుకుని కొత్త కొత్త డిజైన్లను తయారు చేసి నైపుణ్యం సాధించాలని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. నైపుణ్యంతో చేసిన ఉత్పత్తులకు రాష్ట్రంలో, దేశ విదేశాల్లో డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో మహిళలకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉచిత శిక్షణకు వచ్చిన వారు పట్టుదలతో నేర్చుకుని కొత్త కొత్త డిజైన్లను తయారు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్ పేట్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, కృష్ణ కాలనీ టిఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు కృష్ణ యాదవ్, వార్డ్ సభ్యులు రహీమ్, యూత్ నాయకులు ఖాజా, తెలంగాణ మహిళ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ, మహిళ నాయకురాలు రాణి, టిఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు ఉమాదేవి, లక్ష్మీ, మాధవి, భాగ్యమ్మ, ఊర్మిల, కవిత, సవితా బేగం, కుమారి, మల్లమ్మ, దీప మిత్ర నాయక్, సాయా సింగ్ తదితరులు పాల్గొన్నారు.






