నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ జయశంకర్ పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, ఆర్చ్ (స్వాగత తోరణం)ను సోమవారం హఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పార్కుకు ప్రతి నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు వాకింగ్ చేయడానికి వస్తారని అన్నారు. చుట్టు పక్కల వారికి ఈ ఓపెన్ జిమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతం గౌడ్,హఫీజ్ పేట్ డివిజన్ టిఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు వాల హరీష్ రావు, నాయకులు లక్ష్మా రెడ్డి, సాయి బాబా, మనోహర్ గౌడ్, శ్రీనివాస్, రవి కుమార్, చంద్ర శేఖర్, రాజేశ్వర గౌడ్, మోసినుద్దిన్, నాగేశ్వర రావు, ప్రభాకర్, ప్రసాద్, నారాయణ రెడ్డి, జ్ఞానేశ్వర్, బాలసుబ్బయ్య, భగత్, శ్రీను, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






