కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సిపిఎం, ఎంసీపీఐయూ నిరసన

నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం రంగారెడ్డి కార్యదర్శివర్గ సభ్యులు చంద్రమోహన్, ఎం సిపిఐ (యు) గ్రేటర్ కార్యదర్శి తుకారం నాయక్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకు వ్యతిరేకంగా సోమవారం చందానగర్ గాంధీ సర్కిల్ దగ్గర సిపిఎం, ఎం సీపీఐ (యూ) నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వ రంగ సంస్థలను విచ్చలవిడిగా ప్రైవేటీకరణ చేస్తూ కీలక రంగాలైన బొగ్గు, రైల్వే , విద్యుత్ , విమానాశ్రయాలు, ఓడరేవులు, స్టీల్ కంపెనీ, తదితర రంగాల ను పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్న కు వ్యతిరేక నల్ల చట్టాలు, లేబర్ కోడ్ తదితర చట్టాలను తీసుకురావడం ద్వారా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. గతంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రోజుల్లో ఉపాధి హామీ చట్టాన్ని రోజురోజుకీ దెబ్బతీస్తూ రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ పెట్రోల్, డీజిల్ నిత్యావసర ధరలను భారీగా పెంచుతూ దిగువ మధ్యతరగతి కుటుంబాల పై మోయలేని భారాలను చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక విద్యార్థి యువజన మహిళా సంఘాల నాయకులు కృష్ణ, మధు, అంగడి పుష్ప, మురళి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న సీపీఎం, ఎం సీపీఐ యూ నేతలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here