శేరిలింగంపల్లి, డిసెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద సేవా సంఘం వృద్ధుల ఆశ్రమంలో మెడికవర్ హాస్పిటల్స్, చందానగర్ సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉదయం గం. 9.00 ల నుండి మధ్యాహ్నం గం. 2.00 వరకు ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎత్తు, బరువు, కంటి, దంత, రక్తపోటు, షుగర్, పల్స్, ఈ.సీ.జీ. మొదలగు పరీక్షలు నిర్వహించారు. వైద్యులు డాక్టర్ అనూష (జనరల్ ఫిజిషియన్), డాక్టర్ అక్షయ్ కుమార్ (డెంటల్), విజన్ ఐ కేర్ రాము తదితరులు వైద్యసేవలు అందించారు. ఈ వైద్య శిబిరంలో ఆశ్రమ నిర్వాహకులు సుందర ప్రసాద్, సంఘ సేవకుడు వెంకట్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాలం శ్రీనివాస్, తలుపుల శ్రీనివాస్ యాదవ్, హాస్పిటల్ ప్రతినిధి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో వృద్ధులు, పిల్లలకు 90 మందికి వైద్యసేవలు అందించారు.