చందానగర్ పీఆర్ కే హాస్పిటల్ లో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్

  • ప్రారంభించిన మంత్రులు ఈటె‌ల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్ గాంధీ
  • మొదటి విడతగా రాష్ట్రంలోని 2 లక్షల 90 వేల మంది సిబ్బందికి వ్యాక్సిన్: ఈటె‌ల

చందాన‌గ‌ర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కరోనా వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్ కేంద్రంగా మారడం రాష్ట్రానికి గర్వకారణమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. చందానగర్ లోని పిఆర్కె హాస్పిటల్లో శనివారం కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించారు. రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యుడు ఆరెకపూడి గాంధీ, పీఆర్ కే హాస్పిటల్ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్, ఎండి రవి కిరణ్, స్థానిక కార్పొరేటర్ లతో కలిసి మంత్రి ఈటెల రాజేందర్ కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ ను ప్రారంభించారు.

పీఆర్‌కే హాస్పిట‌ల్‌లో డ్రై ర‌న్‌ను ప్రారంభిస్తున్న మంత్రులు ఈట‌ెల రాజేంద‌ర్‌, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

ఈ సందర్భంగా ఈటె‌ల మాట్లాడుతూ గత 11 నెలలుగా కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల ఖర్చుతో కరోనా వ్యాక్సిన్ ను సిద్ధం చేసిందని అన్నారు. ఈ వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్ కేంద్రంగా మారడం గర్వకారణమని, ప్రపంచ దేశాలు నేడు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని అన్నారు. కరోనా విజృంభన నేపథ్యంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న రాష్ట్రంలోని రెండు లక్షల 90 వేల మంది సిబ్బందికి మొదటగా వ్యాక్సిన్ పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలోని ఎనిమిది వందల పైచీలుకు కేంద్రాల్లో ఇప్పటికే వ్యాక్సిన్ డ్రై రన్ నడిచిందని, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం సైతం వారి సిబ్బందికి మొదటగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధపడ్డాయని, ఈ క్రమంలోనే చందానగర్ లోని పీఆర్ కే హాస్పిటల్ వారు డ్రై ర‌న్‌ నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

డ్రై ర‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రులు ఈట‌ల రాజేంద‌ర్‌, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేటర్లతో హాస్పిటల్ యాజమాన్యం

వ్యాక్సిన్ ఇవ్వడంపై ఇప్పటికే రాష్ట్రంలో 10 వేల మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రతిరోజు పది లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వ్యాక్సిన్ ను నిల్వ చేసేందుకు ఇప్పటికే 25 వేల స్టోరేజి బాక్సులను సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి, అదనపు డీఎంహెచ్ఓ సృజన, డీపిఆర్వో పద్మశ్రీ, టీఆర్ఎస్ యువనేత తలసాని సాయి యాదవ్, స్థానిక కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి, రోజా రంగరావు, పుష్ప నాగేష్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాస్ హాస్పిటల్ సిబ్బందిి పాల్గొన్నారు.

డ్రై ర‌న్‌ను ప‌రిశీలిస్తున్న మంత్రులు ఈట‌ెల రాజేంద‌ర్‌, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here