తెలంగాణ హాకీ చైర్మ‌న్ ప‌దివికి కొండా విజ‌య్‌ అన్నివిధాలా స‌మ‌ర్థుడు: చింత‌కింది గోవ‌ర్ధ‌న్ గౌడ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణ‌ హకీ ఛైర్మెన్‌గా నియ‌మితులైన‌ కొండా విజయ్ కుమార్‌ను బీజేపీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, సీనియర్ నాయకులు తోపుగొండ మహిపాల్ రెడ్డి, శాంతిభూషణ్ రెడ్డిలు ఆదివారం ఘ‌నంగా స‌న్మానించారు.ఈ సందర్బంగా గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ కొండా విజయ్ నిత్యకృషీవలుడని, అయన స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకున్నారని అన్నారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలో ఎంతో మంది అభాగ్యులను ఆదుకుంటూ, నిత్యం ఎదో ఒక సేవా కార్యక్రమం చేయడం ఆయనకె సాధ్యపడిందని అన్నారు. ఇప్ప‌టికే రంగారెడ్డి జిల్లా హకీ అధ్య‌క్షుడిగా జిల్లాలో హాకీ అభివృద్ధికి ఎంతో కృషి చేశార‌ని, ఇత‌ర క్రీడ‌ల అభివృద్ధికి సైతం కొండా విజ‌య్‌కుమార్ చేసిన కృషి అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. తెలంగాణ హాకీ ఛైర్మెన్ ప‌ద‌వికి కొండా సరైన స‌మ‌ర్థుడ‌ని, ప్రతిభ గల పేద క్రీడాకారులకు ఆయ‌న ద్వారా ప్రోత్సాహం ల‌భిస్తుంద‌నే ఆశాబావం వ్య‌క్తం చేశారు.

కొండా విజ‌య్‌కుమార్‌ను స‌న్మానిస్తున్న చింతికింది గోవ‌ర్ధ‌న్ గౌడ్‌, తోపుగొండ మ‌హిపాల్‌రెడ్డి, శాంతిభూష‌న్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here