బోయిని ల‌క్ష్మ‌య్య యాద‌వ్‌కు ఘ‌న నివాళి… బిఎల్‌వై ట్ర‌స్ట్ ఆద్వ‌ర్యంలో నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌రాల పంపిణీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ప్రముఖ సంఘ సేవకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ బోయిని లక్ష్మయ్య యాదవ్ నాలుగ‌వ వర్ధంతిని పుర‌స్క‌రించుకుని బీఎల్‌వై చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆద్వ‌ర్యంలో హ‌ఫీజ్‌పేట్‌లోని వారి నివాసం వద్ద 200 కుటుంబాలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్, బిజెపి బీసీమోర్చ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు బోయిని మహేష్ యాదవ్ త‌న తండ్రి బోయిని ల‌క్ష్మ‌య్య చిత్ర‌ప‌టానికి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. అనంత‌రం ఆయ‌న‌ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వారి నాన్న పేరుపైన ఏర్పాటుచేసిన ట్రస్టు ద్వారా నిరుపేద‌ల‌కు విద్య, వైద్యం విష‌యంలో స‌హ‌కారం అందిస్తున్నామ‌ని, దాంతో పాటు ఆకలితో ఉన్నవారికి తోచిన సాయం చేయడం ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ‌మ‌ని అన్నారు. ప్రస్థుతం క‌రోనా విజృంభ‌న నేపథ్యంలో లాక్‌డౌన్ వ‌ల్ల చాలమంది ఉపాధి కోల్పోయి ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, ఈ క్ర‌మంలోనే త‌మ ట్ర‌స్ట్ ద్వారా అలాంటి వారికి నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను అందించి తోచిన బ‌రోసా క‌ల్పించామ‌ని అన్నారు. నాన్న అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ ఇలాంటి సేవాకార్య‌క్ర‌మాల‌తో ముందుకు సాగుతామ‌ని మ‌హేష్ యాద‌వ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హ‌ఫీజ్‌పేట్‌ డివిజన్ బీజేపీ ఇంచార్జ్ బోయిని అనూష యాదవ్, ట్ర‌స్ట్ ప్ర‌తినిధులు సులోచన, మల్లేష్, రాజేష్, నవీన్, సాయి, వెంకన్న, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను పంపిణీ చేస్తున్న బీఎల్‌వై ట్ర‌స్టు చైర్మ‌న్ బోయిని మ‌హేష్ యాద‌వ్‌, ట్ర‌స్టు స‌భ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here