శంకర్ పల్లి మున్సిపాలిటీ లో బీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తుగా కొమిరిశెట్టి సాయిబాబా ప్ర‌చారం

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 9 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): మున్సిపల్ ఎన్నికల సందర్బంగా శంకర్ పల్లి మున్సిపాలిటీ లోని 2 వ వార్డు, 3వ వార్డుకు మహేశ్వరం శాసనసభ్యురాలు పట్లోళ్ల సబితా ఇంద్రా రెడ్డి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాని ఇంచార్జ్ గా నియమించారు. అందులో భాగంగా బిఆర్ఎస్ పార్టీ 2 వ వార్డు అభ్యర్థి బీసోళ్ల సంధ్యా రాణి శ్రీధర్ కి మద్దతుగా శంకర్ పల్లి 2 వ వార్డు లో ఇంటింటికి తిరిగి, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ని గెలిపించాలని కొమిరిశెట్టి సాయిబాబా ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ ప్రభుత్వం లో చేసిన అభివృద్ధి ని, ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమం లో రాగం జంగయ్య యాదవ్, దార్గుపల్లి నరేష్, శామ్లెట్ శ్రీనివాస్ , దారుగుపల్లి పరమేష్, స్థానిక బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here