కీర్తి క్రియేషన్స్ డిజిటల్ స్టూడియో ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల మెయిన్ రోడ్ లో విజయ్ అధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కీర్తి క్రియేషన్స్ డిజిటల్ స్టూడియో ను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ మనలోని భావాలకు భాష్యం చూపే కళ ఫోటోగ్రఫీ అని, ప్రతి క్షణాన్ని అందంగా స్మృతులుగా నిలిపే ఈ కళ సమాజానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. యువకులు సృజనాత్మక ఆలోచనలతో ముందుకు రావడం సంతోషకరమని, విజయ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కీర్తి క్రియేషన్స్ డిజిటల్ స్టూడియో మరిన్ని శాఖలకు విస్తరిస్తూ, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ రంగంలో మైలురాయిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంత్ నాయక్, సీనియర్ నాయకుడు అరుణ్ గౌడ్, స్థానిక నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here