శేరిలింగంపల్లి, అక్టోబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. మియాపూర్ హఫీజ్‌పేటలోని జెన్‌ప్యాక్ట్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉందన్న సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






