శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని శేరిలింగంపల్లిలో ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్ నాయకుడు పొట్టా నరేందర్ యాదవ్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సీనియర్ నాయకుడు కె.ఎన్. రాములు పార్టీ జెండాను ఆవిష్కరించి, బీఆర్‌ఎస్ కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకుడు పొట్టా నరేందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కీలకమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో బీఆర్‌ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ వార్డ్ సభ్యుడు మేకల కృష్ణ యాదవ్, వాకిటి శంకర్, జములయ్య, వడ్డే శ్రీనివాస్, మల్లేష్ గౌడ్, రాజశేఖర్, అవినాష్, హాజీ, పట్టోల్ల నర్సింహ రెడ్డి, అరుణ, జుబేదా తదితరులు పాల్గొన్నారు.





