శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఎగురవేశారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ ఎత్తిన జెండాను దించకుండా పట్టుదల, నిబద్ధతతో ప్రయాణం చేసిఎన్నో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమ వీరుడు కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాగం జంగయ్య యాదవ్, రాగం హరి శంకర్ యాదవ్, దారుగుపల్లి నరేష్, అంజమ్మ, రమేష్ గౌడ్, నారాయణ, రాజు ముదిరాజ్, శామ్లెట్, శ్రీనివాస్, పరమేష్, అశోక్ యాదవ్, నారాయణ, అనిల్ సింగ్, మధు, ఖాదర్ ఖాన్, మక్ బూల్, వెంకట్ రెడ్డి, సురేష్, తహర్, మాధవి తదితరులు పాల్గొన్నారు.






