శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సర్కిల్ ఉప కమిషనర్ శశిరేఖ స్వయంగా పాల్గొని ప్రజల నుంచి పలు విభాగాలకు వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి 12 ఫిర్యాదులు రాగా, రెవెన్యూకు 2, ఇంజినీరింగ్ వింగ్‌కు 5, యూబీడీ 1 మొత్తం కలిపి 20 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఆయా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందికి డీసీ ఆదేశాలు జారీ చేశారు.






