కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికలలో కొండాపూర్ డివిజన్ నుంచి తెరాస కార్పొరేటర్ అభ్యర్థిగా హమీద్ పటేల్ ఘన విజయం సాధించిన సందర్బంగా కొత్తగూడ గ్రామ యువత ఆయనను సన్మానించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ.. యువత ఎన్నికలలో తన వెంట ఉన్నారని, అందుకనే విజయం సాధించానని తెలిపారు. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. వారు తనపై నమ్మకంతో ఓటు వేసి మళ్లీ కార్పొరేటర్‌గా గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలిపారు.






