శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): తీవ్రమైన ప్రాణాంతక అనారోగ్య సమస్యలతో హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తికి సుహృత్ ట్రస్ట్, హనుమాన్ యూత్ అధ్యక్షుడు కనకమామిడి నరేంద్ర గౌడ్ ఆర్థిక సహాయం అందజేశారు. హఫీజ్‌పేటలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన చిర్రా సాంబయ్య కిడ్నీ ఫెయిల్యూర్, గొంతు ట్యూమర్ సమస్యలతో రాందేవ్ హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతూ వైద్య ఖర్చులకు సహాయం అందించే దాతల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కనకమామిడి నరేంద్ర గౌడ్ సాంబయ్యను కలిసి అతని కుటుంబ సభ్యులకు రూ.20వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సుహృత్ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు బాలరాజ్, మెహర్ బాబా, దేవేందర్, వెంకట రమేష్, మల్లని అశోక్ పాల్గొన్నారు.






