శేరిలింగంపల్లి, అక్టోబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ ఆనంద్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిషాసురమర్దిని శ్రీ కనకదుర్గమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాలు, మంత్రోచ్చారణల మధ్య దేవి ప్రతిష్టాపన శోభాయమానంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






