శేరిలింగంపల్లి, అక్టోబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్లో జరుగుతున్న జీటో కనెక్ట్ – 2025 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కి శుక్రవారం బేగంపేట్ విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇతర నాయకులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగత కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. బిజెపి చేపట్టే కార్యక్రమాలలో పాల్గొనడంతో పార్టీని మరింత ప్రజలలోకి తీసుకుపోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.






