పేదల సంక్షేమమే‌ ప్రభుత్వ ధ్యేయం… కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో ప్ర‌భుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి:  పేదల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన 125 మంది లబ్ధిదారులకు రూ. 1,25,14,500/- ఒక కోటి ఇరవై ఐదు లక్షల పదునాలుగు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ యాదగిరి,వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి,మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్,కూకట్‌పల్లి డివిజన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు,దామోదర్ రెడ్డి నాయినేని చంద్రకాంత్ రావు, కోనేరు ప్రసాద్, కార్తిక్ రావు,  పోతుల రాజేందర్, కాశినాథ్ యాదవ్, రాంచందర్, చిన్నోళ్ల శ్రీనివాస్, మున్నా, కాజా, పోశెట్టి గౌడ్, వాసుదేవరావు, వాసు, రాములు గౌడ్, యాదగిరి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణలక్ష్మీ,‌షాదీముబారక్ చెక్కులను అందజేసిన ప్రభుత్వ విప్‌ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here