వ్యాధి చికిత్స కన్నా నివారణ మార్గ‌మే మిన్న: టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ విమలథామస్

  • వర్షాకాలంలో వచ్చే వ్యాధులు – నివారణ చర్యలపై ఫ్రెండ్స్ వెల్ఫేర్ అవ‌గాహ‌న క‌ర‌ప‌త్రం ఆవిష్క‌ర‌ణ‌

నమస్తే శేరిలింగంపల్లి: వ్యాధి చికిత్స కన్నా వ్యాధి నివారణ మార్గ‌మే మిన్న అని టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ విమలథామస్ అన్నారు. శుక్రవారం ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన వర్షాకాలంలో వచ్చే వ్యాధులు – నివారణ చర్యలపై అవగాహన కరపత్రాన్ని డాక్టర్ విమలా థామస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో అతిసారం , డెంగీ , మలేరియా , మెదడు వాపు వ్యాధి లాంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ అని, ప్రతిఒక్కరూ వాటి పట్ల తగిన‌ జాగ్రతలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.‌ సబ్బుతో గాని శానిటైజర్ తో గాని చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని అన్నారు. కోవిడ్ 19 వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలన్నారు. రోగనిరోధక శక్తిని పెంపొందించే కషాయాలు , తాజాపండ్లను, పౌష్టిక ఆహారం తీసుకోవాలని డాక్టర్ విమలాథామస్ అన్నారు. ప్రతినిత్యం వ్యాయామం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిమ్స్ సూపరడెంట్ డాక్టర్ ఇషాన్ అహ్మద్ ఖాన్ , కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాణి సాంబశివరావు , చీదర్ల వెంకటేశ్వరరావు , పాలం శ్రీను , సాయిరంగా కన్‌స్ట్రక్షన్ ప్రతినిధి కె రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

వ్యాధులు – నివారణ చర్యల పై అవగాహన‌ పత్రాన్ని విడుదల చేస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here