ప్రభుత్వ విప్ గాంధీని కలిసిన ఎల్లమ్మబండ మైనారిటీ సోదరులు

నమస్తే శేరిలింగంపల్లి: బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండకి చెందిన మైనారిటీలు శుక్రవారం కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మైనారిటీ సోదరులకు ప్రభుత్వ విప్ గాంధీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం‌ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్, టీఆర్ఎస్ నాయకులు చిన్నోళ్ల శ్రీనివాస్, కాశినాథ్ యాదవ్, లక్ష్మీ ,మైనార్టీ సోదరులు మున్నా , కాజా , శాయిద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

మైనారిటీ సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here