శేరిలింగంపల్లి, అక్టోబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): విజయదశమి సందర్బంగా శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాని జూనియర్ ఆర్టిస్ట్ జానీ మర్యాద పూర్వకంగా కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా జానీకి సాయిబాబా నూతన వస్త్రాలు అందించి పండుగ కానుక అందజేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శుభాకాంక్షలు తెలిపిన నాయకులు..
శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాని శేరిలింగంపల్లి నియోజకవర్గం, గచ్చిబౌలి డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.






