మియాపూర్ సెప్టెంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ లోని ఆర్ వి అవనీంద్ర గేటెడ్ కమ్యూనిటీలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అపార్ట్మెంట్లలోని మహిళలు పెద్ద సంఖ్యలో ఒక చోట చేరి బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. భారీ బతుకమ్మలను పేర్చి పసుపు గౌరమ్మ లను భక్తిశ్రద్ధలతో పూజించారు. యువతులు మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. అనంతరం స్థానిక గురునాథ్ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.







