శేరిలింగంపల్లి, ఏప్రిల్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ విలేజ్ లో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 108 కలశాలతో అభిషేకము, సింధూర అలంకరణ పూజ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామచందర్ ముదిరాజ్, ఓంప్రకాష్ గౌడ్, వెంకటేష్ గౌడ్, వీరేందర్ గౌడ్, నాగేశ్వర్ గౌడ్, భాస్కర్ గౌడ్ మహేందర్ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్, రామచందర్ గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, సతీష్ గౌడ్, నరేందర్ ముదిరాజ్, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.