శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన హేమంత్ భోర్ఖడేని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.జగదీశ్వర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, సీసీ రోడ్లు, నాలా అభివృద్ధి చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ని కలిసి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రతి డివిజన్ పరిధిలోని కాలనీ, బస్తి అభివృద్ధికి కృషి చేస్తామని, తమ దృష్టికి వచ్చే ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.