అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమైన విషయం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG కాలనీలో రూ.92 లక్షలతో నూతనంగా చేపట్టబోయే నేతాజీ కమ్యూనిటీ హాల్ అభివృబ్ది పనులకు, F పార్క్ షెడ్, సంకల్ప్ గ్రౌండ్ లో నీటి సంపు, రీడింగ్ రూమ్ ప్రహరీ గోడ, ఫర్నిచర్, ఓపెన్ జిమ్ నిర్మాణం పనులకు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీ ల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. కాలనీ వాసులకు ఉపశమనం లభించింది అని, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, నాగమణి, నాయకులు మరబోయిన రాజు యాదవ్, మాజీ డైరెక్టర్లు వెంకట్ రావు, రాములు, సుబ్బారావు, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు రాధాకృష్ణ, సత్యనారాయణ, భాస్కర్ ముదిరాజ్, చింత కింది రవీందర్ గౌడ్, యువ నాయకులు తిలావత్, చిన్న, లక్ష్మీ స్వర్ణలత, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here