శేరిలింగంపల్లి, జనవరి 22 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ యువజన కాంగ్రెస్ నాయకుడు హనీఫ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకుని వెంటనే ఆయన ఇంటికి శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ వెళ్లి పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకుని, ఆర్ధిక సహాయం చేశారు. భవిష్యత్తులో కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడైన హనీఫ్ కి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.






