శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పాస్టర్లతో ఆత్మీయ సమావేశం

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పాస్టర్ల ఆత్మీయ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ , సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, పాస్టర్ల తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ క్రైస్తవ సమాజం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత‌గానో కృషి చేస్తున్నార‌ని అన్నారు. క్రైస్తవుల అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడుతున్నార‌ని అన్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పాస్టర్లు మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా చేసుకోవడానికి త‌మ‌కు అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయించి త‌మ‌కు అండగా నిలిచిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here