శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 28 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పేట్ విలేజ్ లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సన్నద్ధం కోసం పరీక్షల కిట్ (జామెట్రీ బాక్స్, ప్యాడ్, పెన్నులు) లను విద్యార్థులకు క్షత్రియ యూత్ పెడరేషన్ సభ్యులతో ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల సన్నద్ధం కోసం పరీక్షల కిట్ లను అందించడం చాలా గొప్ప విషయం అని అన్నారు. క్షత్రియ యూత్ ఫెడరేషన్ సభ్యులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, క్షత్రియ యూత్ పెడరేషన్ సభ్యులు, హరి, చైతన్య, పవన్, హరీష్, ఎన్ ఎస్ ఎన్ రాజు, ఫణి, వర్మ, చందు తదితరులు పాల్గొన్నారు.






