శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 28 (నమస్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో చిర్రా రవీందర్ యాదవ్ భేటీ అయ్యారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ లో కలిసిన చిర్రా రవీందర్ యాదవ్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని తాజా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే ఇద్దరి మధ్య సరదాగా కొద్ది సేపు సమావేశం జరిగింది. అనంతరం చిర్రా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లిలో అన్ని డివిజన్ లను గెలుచుకుంటామన్నారు. కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ లో గులాబీ ప్రభంజనం సృష్టిస్తామని చిర్రా రవీందర్ యాదవ్ వెల్లడించారు.






