ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో ఘనంగా అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం

శేరిలింగంప‌ల్లి, మే 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): లింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని పద్మ అపార్ట్ మెంట్ లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి, క్రొవ్వొత్తి వెలిగించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య అధర్ హబీబ్ సిద్ధిఖి, స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, HCU, అతిథులుగా డాక్టర్ B.C. రామన్న సత్యసాయి సేవా సమితుల కన్వీనర్, E. దేవానంద్ యాదవ్ – సోషల్ వర్కర్ లు విచ్చేసి మాట్లాడుతూ ఫ్లోరెన్స్ నైటింగేల్ మరలా పుట్టి నేటి ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితులను మెరుగు పరచాలని కోరుకుందామ‌ని, సేవానిరతి గల ప్రతి నర్సులోనూ ఆమె కలకాలం జీవించి ఉంటుంద‌ని, నర్సులు, రోగులు గుర్తుంచుకోవలసిన ఆదర్శ మూర్తి ఫ్లోరెన్స్ నైటింగేల్ అని అన్నారు.

ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ వైద్యశాలలలో సేవలందిస్తున్న 80 మంది నర్సులకు ఉత్తమ నర్సు పురస్కారాలను అంద‌జేసి స‌త్క‌రించారు. E. దేవానంద్ యాదవ్ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్ధన్, అమ్మయ్య చౌదరి, కొండల్ రెడ్డి, బాలరాజు, విజయలక్ష్మి, నాగమణి, G. V. రావు, సత్యనారాయణ, ప్రేమ్ సింగ్, జిల్ మల్లేష్, ఖాదర్ మొయినుద్దీన్, శివపామిరెడ్డి, ఇమామ్, పాండు, సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here