శిల్పకళా వేదికలో సీఎం కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు

శేరిలింగంప‌ల్లి, జూలై 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజ‌న శిల్పకళా వేదికలో ఉన్నతాధికారులతో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సమాచార, ప్రజాసంబంధాల కమిషనర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, కూకట్‌పల్లి డీసీపీ, అదనపు కమిషనర్ (పారిశుద్ధ్యం), కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌తోపాటు ఈవెంట్ మేనేజ్‌మెంట్ బృందం పాల్గొన్నారు.

కార్యక్రమ ప్రాంగణంలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, వేదిక నిర్వహణ, లాజిస్టిక్స్, ప్రజా సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు తదితర అంశాలను అధికారులు క్షుణ్నంగా పరిశీలించి సమీక్షించారు. కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు, సంబంధిత సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేసి అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here