శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): అమీన్పూర్ రోడ్లో చేపడుతున్న రోడ్డు వెడల్పు పనులను సంబంధిత అధికారులు పరిశీలించారు. చందానగర్ ఏసీపీ, ఈఈ, డీవైఈఈ, సీఐలతో కలిసి పనుల పురోగతిని పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. మరోవైపు మియాపూర్ సర్కిల్-48, ఎస్‌ఎల్‌పీజెడ్ పరిధిలోని శంకర్‌నగర్, భవానీ శంకర్‌నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య తనిఖీలు నిర్వహించారు. డీవైఈఈ, ఎస్ఆర్పీతో కలిసి మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జి. శ్రీనివాస్ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా స్థానిక రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ల (RWAs) ప్రతినిధులతో మాట్లాడారు. పార్కులు, నాలా ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ పనులను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా, చెత్త రహితంగా ఉంచడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని సిబ్బందికి అధికారుల సూచించారు.





