శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్, వేమన కాలని, శంకర్ నగర్ ఫేజ్ 1, శంకర్ నగర్ ఫేజ్ 2, పి జే ఆర్ స్టేడియం, వెంకటాద్రి కాలనీలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో చందానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘునాథరెడ్డి, గురుచరణ్, అక్బర్ ఖాన్, నాగరాజు, యూసఫ్, వరలక్ష్మి , భవానీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వం పాలన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు ప్రాణ త్యాగం చేశారని, ఆ సమర ఫలమే స్వతంత్ర భారత ఆవిర్భావం అన్నారు.






