శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్‌నగర్, సాయి నగర్, చంద్ర నాయక్ తాండ, ఖానామెట్, కొండాపూర్, మాధవ నగర్ కాలనీలలో మాదాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా చోట్ల జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ 1947 ఆగస్టు 15 నాడు ఈ భూమి మీద ఒక కొత్త ఉదయం పుట్టిందన్నారు. దాస్యపు సంకెలలను విరిచి, కోట్లాది భారతీయుల త్యాగం, రక్తం, చెమటతో మన దేశం స్వతంత్రంగా నిలబడిందన్నారు. గాంధీ అహింసా దీక్ష నుండి భగత్‌సింగ్ త్యాగం వరకు, సుభాష్ చంద్రబోస్ ధైర్యం నుండి లక్షల మంది పేరు లేని వీరుల పోరాటం వరకు ఈ స్వేచ్ఛ అనేది అందరు కలసి సాధించిన విజయగాథ అని అన్నారు.






