లలితా పోచమ్మ దేవాలయంలో ఘ‌నంగా సామూహిక కుంకుమార్చన

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శ్రావణ మాసం సందర్బంగా చందాన‌గ‌ర్‌లోని గౌత‌మి న‌గ‌ర్ వేముకుంట‌లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో లలితా సహస్రనామ సామూహిక కుంకుమార్చన నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సుమారుగా 400 మహిళ‌లు అమ్మవారి లలితా సహస్రనామ కుంకుమార్చనలో పాల్గొన్నారు. అనంత‌రం సుమారుగా 1500 మంది భక్తులు అన్నప్ర‌సాదం స్వీకరించారు. ఈ పూజలో టీపీసీసీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి, కాంగ్రెస్ పార్టీ శేరిలింగంప‌ల్లి ఇన్‌చార్జి, కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌, కార్పొరేట‌ర్లు మంజుల రఘునాథరెడ్డి, పూజిత గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు రఘునందనరెడ్డి, యువ నాయకుడు జేరిపాటి రాజు, మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకరరెడ్డి దంపతులు, ప‌రిస‌ర ప్రాంతాల‌కు చెందిన భ‌క్తులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here