నేతాజీ నగర్ కాలనీలో కాలనీ శుభ్రత మనందరి బాధ్యత: అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 8 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో కాలనీ అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ జిహెచ్ఎంసి సహకారంతో కాలనీలో శుభ్రత స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కాలనీలోని ఓపెన్ నాలాలు, వాటి పరిసరాలు చెత్తా చెదారంతో నిండిపోయి ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని జిహెచ్ఎంసి సూపర్వైజర్ భరత్, రాందాస్ ల‌కి సమాచారం ఇవ్వగా వారు స్పెషల్ డ్రైవ్ శుభ్రత విషయంలో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా నేతాజీ నగర్ కాలనీ ప్రజలు కూడా ఎప్పటికప్పుడు తమ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. మన ఇంటిలోని చెత్త బహిరంగ ప్రదేశాలలో పడేయకుండా జిహెచ్ఎంసి నియమించిన చెత్త బండిలోనే తప్పనిసరిగా వెయ్యాలని, మన పరిసరాల‌ను మనమే శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. చెత్తను ఆరుబ‌య‌ట‌ వేయడం వల్ల దోమలు, ఈగలు ప్రబలి దుర్వాసనతో ప్రజలు అనేక ఇబ్బందులు పడతారని ,అనేక ప్రాణాంతకమైన రోగాల బారిన పడతారని అన్నారు. క‌నుక‌ మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాల‌ని, చెత్తను ఎట్టి పరిస్థితుల్లో జిహెచ్ఎంసి చెత్త బండికి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here