స్పంద‌న సేవా సంస్థ‌కు కావ‌ల్సిన స‌హాయం అంద‌జేస్తాం: కొండా విజయ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 8 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): హోప్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ కొండా విజయ్, స్పందన సేవా సంస్థ గౌరవ అధ్యక్షుడు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి చేతుల మీదుగా స్పందన సేవా సంస్థ అధ్యక్షుడు కొమ్ముల శ్యామ్ ఆధ్వర్యంలో నూతనంగా చేరిన అందరికీ ఐడీ కార్డ్స్ ను అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో కొండా విజయ్ మాట్లాడుతూ స్పందన సేవా సంస్థ కార్యక్రమాలు బాగున్నాయని, మరింత సేవ చేయడానికి, ఆహార పంపిణీ కోసం కిరాయి వాహనాలపై ఆధారపడే సంస్థకు త్వరలోనే ఓమ్ని లాంటి వాహ‌నాన్ని కొని పెడతానని హామీ ఇచ్చారు. వారికి ఈ సందర్భంగా సంస్థ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలను సంస్థ సభ్యులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ.షేక్ సలీం, ట్రెజరర్.అలిగే వినోద్, బేగారి ఆనంద్, రాంబాబు, రవి, అశోక్, లాలూ ప్రసాద్, మల్లేష్ యాదవ్, షేక్ హాజీ, పెండ్యాల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here