శేరిలింగంపల్లి, డిసెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి స్టేడియం జంక్షన్, JRC జంక్షన్ , కాజాగుడా చౌరస్తా జంక్షన్, బయో డైవర్సిటీ జంక్షన్ ల వద్ద చేపట్టిన సుందరికరించి, విద్యుత్తు వెలుగులతో అభివృద్ధి చేసిన కూడలిలను మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రతి కూడలి ని సుందర శోభిత వనం గా తీర్చిదిద్దుతామని , అభివృద్ధి చేసిన జంక్షన్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు,మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.