వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌ను పాటిస్తే ఎలాంటి రోగాలు రావు: డాక్ట‌ర్ స్ర‌వంతి

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): విద్యార్థులంద‌రూ ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌ను పాటించ‌డంతోపాటు వ్య‌క్తిగ‌తంగా కూడా ప‌రిశుభ్రంగా ఉండాల‌ని వావిలాల ప‌ల్లె ద‌వాఖాన డాక్ట‌ర్ స్ర‌వంతి అన్నారు. వావిలాల జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్‌లో విద్యార్థుల‌కు నులి పురుగులు, పైలేరియా వ్యాధుల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌ను పాటిస్తే చాలా వ‌ర‌కు రోగాలు రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ని అన్నారు. రోగం వ‌చ్చిన త‌రువాత బాధ‌ప‌డ‌డం క‌న్నా అది రాకుండా ముందుగానే నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఉత్త‌మ‌మ‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయుడు విజ‌య్ కుమార్‌, ఏఎన్ఎం అగ్నిష‌, సూపర్‌వైజ‌ర్ ఎలిజ‌బెత్‌, రాజ‌కుమారి, సురేష్‌, కో ఆర్డినేట‌ర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here