శేరిలింగంపల్లి, ఆగస్టు 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ సర్కిల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో 5 ఫిర్యాదులు రాగా, హెల్త్ అండ్ శానిటేషన్లో 1, యూసీడీ వింగ్ లో 1, ఇంజినీరింగ్ వింగ్లో 4 ఫిర్యాదులు వచ్చాయి. ఇతర సెక్షన్లలో 1 ఫిర్యాదు వచ్చింది. రెవెన్యూ, యూబీడీ, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఎలాంటి ఫిర్యాదులు అందలేదని అధికారులు తెలిపారు. ప్రజావాణిలో మొత్తం 12 ఫిర్యాదులు రాగా వాటిపై సత్వరమే స్సందించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.






